రైతుపై దాడి ఘటనపై విచారణ

ABN , First Publish Date - 2023-02-17T22:18:14+05:30 IST

మండలంలోని బీరంగుంటలో రైతుపై దాడి జరిగిన ఘటనపై కావలి డీఎస్పీ వెంకట రమణ, కావలి రూరల్‌ సీఐ రాజేష్‌లు శుక్రవారం విచారణ చేపట్టారు. బీరంగుంటలో తన భూమికి ఆనుకొని ఉన్న పైడేరు కట్ట మట్టిని ఎక్స్‌కవేటర్‌తో తరలిస్తుండగా ప్రశ్నించినందున బీరంగుంటకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రపై అదే గ్రామానికి చెం

రైతుపై దాడి ఘటనపై విచారణ
17అల్లూరు4 : విచారిస్తున్న డీఎస్పీ వెంకట రమణ, సీఐ రాజేష్‌లు

అల్లూరు, ఫిబ్రవరి 17: మండలంలోని బీరంగుంటలో రైతుపై దాడి జరిగిన ఘటనపై కావలి డీఎస్పీ వెంకట రమణ, కావలి రూరల్‌ సీఐ రాజేష్‌లు శుక్రవారం విచారణ చేపట్టారు. బీరంగుంటలో తన భూమికి ఆనుకొని ఉన్న పైడేరు కట్ట మట్టిని ఎక్స్‌కవేటర్‌తో తరలిస్తుండగా ప్రశ్నించినందున బీరంగుంటకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గుమ్మడి సాయి చరణ్‌, మునికృష్ణ, శివకృష్ణ, హరిబాబులు దాడిచేసిన విషయం విదితమే. దీంతో అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది తన ఇంటికి వెళ్లిన నరేంద్రపై ఆయన కుటుంబ సభ్యులపై మళ్లీ రాత్రి 10.30 గంటల సమయంలో వైసీపీ నాయకులు దాడికి దిగారు. దాడిలో తలకు బలమైన గాయమైన నరేంద్రను స్థానికులు వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆయన తల్లిదండ్రులు, ప్రత్యర్థివర్గానికి చెందిన గుమ్మడి వెంకయ్య, గుమ్మడి శైలజలకు గాయాలు కావడంతో అల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్న సమస్యలు పార్టీలకు ఆపాదించి గ్రామ సమస్యగా మార్చేందుకు ఎవరూ ప్రయత్నించకూడదన్నారు. సీఐ రాజేష్‌ మాట్లాడుతూ గ్రామస్థులు సంయమనం పాటించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఐ చిన్న బలరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

------

Updated Date - 2023-02-17T22:18:15+05:30 IST