Nellore: ఐదు నెలలుగా మృత్యువుతో పోరాటం..అయినా దక్కని ప్రాణం

ABN , First Publish Date - 2023-02-01T08:41:32+05:30 IST

అత్యాచార, హత్యాయత్నానికి గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

Nellore: ఐదు నెలలుగా మృత్యువుతో పోరాటం..అయినా దక్కని ప్రాణం

నెల్లూరు/వెంకటాచలం: అత్యాచార, హత్యాయత్నానికి గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని చెముడు గుంట పంచాయతీ నక్కల కాలనీకి చెందిన బాలిక మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది సెప్టెంబరు 5న బాలిక తన ఇంట్లో ఉండగా ఎవరూ లేని సమయంలో వరుసకు మేనమామ అయిన నాగరాజు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె ప్రతిఘటించింది. దాంతో అతను ఆమె ముఖంపై యాసిడ్‌ పోసి గొంతు కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక అప్పటి నుంచి కొన్ని రోజులపాటు నెల్లూరులో చికిత్స పొందింది. ఆ తర్వాత మెరుగైన వైద్య కోసం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలిక వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-01T08:41:35+05:30 IST