Nellore: నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D2

ABN , First Publish Date - 2023-02-10T09:40:10+05:30 IST

శ్రీహరికోట నుంచి SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి

Nellore: నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D2

నెల్లూరు: శ్రీహరికోట నుంచి SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాయి. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి SSLV-D2 రాకెట్ మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహ ప్రయోగం శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. 6.30 గంటలపాటు సాగిన తర్వాత 9.18 గంటలకు షార్ లోని తొలి ప్రయోగ వేదిక ఎస్ఎస్ఎల్ వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది.

శ్రీహరికోటలోని ప్రథమ ప్రయోగ వేదిక మీద సిద్ధంగా ఉన్న రాకెట్‌ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువైన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-07, స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మన దేశ విద్యార్థినులు రూపొందించిన 8.7కిలోల బరువైన ఆజాదీ శాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానూస్‌-01 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. అంతకుముందు రాకెట్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్‌ఎస్ఎల్వీ తొలి రాకెట్‌ చివరి నిమిషంలో ఉపగ్రహాల నుంచి సంకేతాలు అందకపోవడంతో విఫలమైంది.

Updated Date - 2023-02-10T10:33:24+05:30 IST