ISRO: మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం.. నింగిలోకి వెళ్లనున్న..!
ABN , First Publish Date - 2023-10-20T14:53:41+05:30 IST
ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 8 గంటలకు గగన్యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. భవిష్యత్తులో
నెల్లూరు: ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 8 గంటలకు గగన్యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత రాకెట్ ప్రయోగాల కోసం ఈ టెస్ట్ వెహికల్ ప్రయోగం నిర్వహిస్తున్నారు. మరో రెండు, మూడు టెస్ట్ వెహికల్ ప్రయోగాలు చేపట్టిన అనంతరం మానవ సహిత రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. షార్ కేంద్రంలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి D1 రాకెట్ ద్వారా క్రూమాడ్యుల్‌ని నింగిలోకి పంపనున్నారు. క్రూమాడ్యూల్ బరువు 4520 కిలోలు. భూమి నుంచి 17 కి.మీ ఎత్తులో రాకెట్ నుంచి క్రూమాడ్యూల్ విడిపోనుంది. అయిదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్ చేశారు. షార్ కేంద్రానికి 10కి.మీ దూరంలో బంగాళాఖాతం సముద్రంలోకి పడేలా రూపకల్పన చేశారు. ఇండియన్ నావీ సహకారంతో క్రూమాడ్యుల్‌ని ఇస్రో సేకరించనుంది.
D1 రాకెట్ బరువు 44 టన్నులు
పొడవు 34.954 మీటర్లు
టెస్ట్ వెహికల్ బరువు 7 టన్నులు
క్రూ ఎస్కేప్ సిస్టమ్ బరువు 12.5 టన్నులు
క్రూ మాడ్యూల్ బరువు 4.5 టన్నులు