కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కర్నాటి

ABN , First Publish Date - 2023-04-07T22:45:29+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి , అర్హులకు అందేలా బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టిసారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరులోని త్రికోటేశ్వర కల్యాణ మండలంలో బూత్‌ స్వశక్తి కరణ్‌ అభియాన్‌ సమావేశాన్ని నియోజకవ

          కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కర్నాటి
7ఎటికె1 : సమావేశంలో మాట్లాడుతున్న కర్నాటి ఆంజనేయరెడ్డి

ఆత్మకూరు, ఏప్రిల్‌ 7: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి , అర్హులకు అందేలా బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టిసారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరులోని త్రికోటేశ్వర కల్యాణ మండలంలో బూత్‌ స్వశక్తి కరణ్‌ అభియాన్‌ సమావేశాన్ని నియోజకవర్గ కన్వీనర్‌ కరటంపాటి సుధాకర్‌ ఆధ్య్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉందన్నారు. మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల తీరును ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీధర్‌రెడ్డి, నాయకులు పెంచలయ్య, కాలం బుజ్జిరెడ్డి, వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

-----------------

Updated Date - 2023-04-07T22:45:29+05:30 IST