చుక్కల భూములకు పరిష్కారం చూపింది జగనే..

ABN , First Publish Date - 2023-06-17T21:58:50+05:30 IST

: చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం చూపింది సీఎం జగన్మోహన్‌రెడ్డేనని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు.మండలంలోని మొగిలిచెర్లలో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోబిక పాల్గొన్నారు.ఈ సందర్బంగా గ్రామ సచివాలయం ఆవరణలో చుక్కల

చుక్కల భూములకు పరిష్కారం చూపింది జగనే..
17 ఎల్‌ఎస్‌ఎం 1: మొగిలిచెర్లలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

-ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

లింగసముద్రం, జూన్‌ 17 : చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం చూపింది సీఎం జగన్మోహన్‌రెడ్డేనని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు.మండలంలోని మొగిలిచెర్లలో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోబిక పాల్గొన్నారు.ఈ సందర్బంగా గ్రామ సచివాలయం ఆవరణలో చుక్కల భూముల విముక్తి పత్రాల పంపిణీ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో అత్యధికంగా చుక్కల భూములున్న గ్రామం మొగిలిచెర్ల అని చెప్పారు.అయితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందాలంటే భూములకు సరైన ధ్రువపత్రాలు ఉండాలన్నారు. సబ్‌కలెక్టర్‌ శోబిక మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలోని 77 మంది రైతులకు 250 ఎకరాల చుక్కల భూములకు విముక్తి పత్రాలు ఇచ్చామన్నారు. త్వరలో మరో 700 ఎకరాలకు పైగా చుక్కల భూములను మిగిలిన రైతులకు విముక్తి పత్రాలను అందచేస్తామన్నారు. అనంతరం ఆమె మండలంలోని లింగసముద్రం-2, ఎర్రారెడ్డిపాలెం గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌ తానికొండ ప్రసాద్‌, ఎంపీడీవో యూ శేషుబాబు, పలువురు అధికారులు, రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

----------

Updated Date - 2023-06-17T21:58:50+05:30 IST