రైలు పట్టాలపై ఇంజనీరింగ్‌ విద్యార్థి సెల్‌ఫోన్‌!

ABN , First Publish Date - 2023-02-21T21:55:30+05:30 IST

రైలు పట్టాలపై ఉంటున్న మృతదేహాలపై సమగ్ర దర్యాప్తు చేయకుండా మొక్కుబడిగా విచారణ చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

రైలు పట్టాలపై ఇంజనీరింగ్‌ విద్యార్థి సెల్‌ఫోన్‌!

కావలి, ఫిబ్రవరి 21: రైలు పట్టాలపై ఉంటున్న మృతదేహాలపై సమగ్ర దర్యాప్తు చేయకుండా మొక్కుబడిగా విచారణ చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్‌లో ఉన్న పోలీసులను పని్‌షమెంట్‌ కింద రైల్వేకు బదిలీ చేస్తుండటంతో వారు తమ విధులను చిత్తశుద్ధితో చేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి. దీనిని ఆసరా చేసుకుని మిస్టరీ కేసులు వాస్తవాలు తేలకుండానే ప్రమాదాల కింద క్లోజ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్‌ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి టీ.ప్రదీప్‌ కావలిలో రైల్వే ట్రాక్‌పై శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. వాస్తవంగా ఆ విద్యార్థి వద్ద ఆ సమయంలో సెల్‌ఫోన్‌ ఉన్నా దర్యాప్తులో దానిని రైల్వే పోలీ్‌సలు గుర్తించలేదు. గుర్తు తెలియని వ్యక్తిగా చూపించారు. ఆ విద్యార్థికి 20 ఏళ్ల వయస్సు ఉంటే దానిని సుమారు 35 నుంచి 40 ఏళ్లుగా గుర్తించారు. అలాగే మృతదేహం ఉన్న ప్రాంతంలో తని సెల్‌ఫోన్‌ ఉన్నా అంత ఓపికగా దానిని వెతకలేక పోయారు. దీంతో అక్కడే మృతుడిని గుర్తింపు కష్టమై గుర్తుతెలియని వ్యక్తిగా వ్యవహరించాల్సిన పరిస్థితిని కల్పించారు. అయితే పత్రికల్లో వచ్చిన వార్తను చూచి ఆ విద్యార్థి బంధువులు దగ్గరలోనే రైల్వే పోలీ్‌సస్టేషన్‌ ఉండటంతో అక్కడకు వెళ్లగా మృతుడిని గుర్తించగలిగారు. ఆ తర్వాత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా సోమవారం ఆ విద్యార్థి బంధువులు ఘటన జరిగిన రైల్వే పట్టాలు వద్దకు వెళ్లి పరిశీలించగా ఆ విద్యార్థి సెల్‌ఫోన్‌ కూడా లభ్యమైంది. ఆ ఫోన్‌ పూర్తిగా పనికిరాకుండా పోవడంతో అందులో ఉన్నసిమ్‌లతో పాటు ఫోన్‌ను కావలి డీఎస్పీ, రూరల్‌ సీఐ, రైల్వే సీఐ సమక్షంలో రైల్వే ఎస్‌ఐకు అప్పగించారు. ఆ ఫోన్‌లో ఉన్న కాల్‌ డేటాను బయటకు తీస్తే ఆయన మృతికి గల కొన్ని కారణాలు వెలుగుచూసి వాస్తవాలు తెలిసి పోలీ్‌సల దర్యాప్తు సులభతరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2023-02-21T21:55:32+05:30 IST