సైకో పాలనపై ప్రజలు విసుగు చెందారు : టీడీపీ
ABN , First Publish Date - 2023-02-18T21:56:10+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ సైకోపాలనపై విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ ని అధికారంలోకి తీసుకురావాలని ఎదురుచూస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. ఇదేంఖర్మ మన రాష్ట్రా
కావలి, ఫిబ్రవరి18: రాష్ట్రంలో వైసీపీ సైకోపాలనపై విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ ని అధికారంలోకి తీసుకురావాలని ఎదురుచూస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శనివారం 40వవార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నవ రవిచంద్ర, పోతుగంటి అలేఖ్య, గుత్తికొండ కిషోర్, షేక్ రఫీ, దారంశెట్టి రవి, కుందుర్తి కిరణ్, ఉప్పుటూరు బాలగురుస్వామి, తటవర్తి వాసు తదితరులు పాల్గొన్నారు.