రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి

ABN , First Publish Date - 2023-09-05T22:22:16+05:30 IST

: మండల పరిధిలోని జాతీయ రహదారిపై మనుబోలు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందాడు. ఎస్‌బీఐ ఎదురుగా ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా నెల్లూ

రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి
1ఎంబీఎల్‌ 5 : ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి

మనుబోలు, సెప్టెంబరు 5: మండల పరిధిలోని జాతీయ రహదారిపై మనుబోలు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందాడు. ఎస్‌బీఐ ఎదురుగా ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా 108లో గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. రోడ్డుపై కాగితాలు ఏరుకునే యాచకుడు అయి ఉంటాడని, మద్యం సేవించి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంగమేశ్వరరావు తెలిపారు.

-----------

Updated Date - 2023-09-05T22:22:16+05:30 IST