సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి : మాలేపాటి

ABN , First Publish Date - 2023-01-20T22:45:42+05:30 IST

రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ఈ సైకో జగన్మోహన్‌రెడ్డి పోయి సైకిల్‌ వస్తేనే రాష్ట్రం బాగుపడి ప్రజలు సుభిక్షంగా ఉంటారని కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు.

సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి : మాలేపాటి
మహిళలతో మాట్లాడుతున్న మాలేపాటి తదితరులు

కావలి, జనవరి 20: రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ఈ సైకో జగన్మోహన్‌రెడ్డి పోయి సైకిల్‌ వస్తేనే రాష్ట్రం బాగుపడి ప్రజలు సుభిక్షంగా ఉంటారని కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. పట్టణంలోని మద్దూరుపాడు అడవిరాజుపాలెంలో శుక్రవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ అరాచకపాలన గురించి వివరించారు. స్థానికులు తమకు రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు సమస్య ఉందని, దోమల ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. టీడీపీని ఆదరించండని, అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతుగంటి అలేఖ్య, మన్నవ రవిచంద్ర, కొండా వెంకట్రావు, కొమరా వెంకటేశ్వర్లు, పిలిమిట్ల సుబ్రహ్మణ్యం, రాధమ్మ, పోతుగంటి శ్రీకాంత్‌, మంచాల ప్రసాద్‌, చిట్టాబత్తిన మాల్యాద్రి, గొట్టిపాటి రాము, వెంకటేశ్వర్లు, శీనయ్య, పులి సురేష్‌, కొండా శ్రీనివాసులు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T22:45:44+05:30 IST