వేమనకు ఘన నివాళి
ABN , First Publish Date - 2023-01-19T23:20:13+05:30 IST
తెలుగు జాతి కీర్తిని పతాక స్థాయికి చేర్చి జాతి గర్వించదగ్గ కవి వేమన అని పలువురు విద్యావేత్తలు అన్నారు.

పొదలకూరు, జనవరి 19 : తెలుగు జాతి కీర్తిని పతాక స్థాయికి చేర్చి జాతి గర్వించదగ్గ కవి వేమన అని పలువురు విద్యావేత్తలు అన్నారు. గురువారం వేమన జయంతిని పురస్కరించుకుని అమరావతి, గాయత్రి, విజేత పాఠశాలల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేకు, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు వేమన శతకాలు, ఆయన పండిత జ్ఞానం గురించి వివరించారు. వేమన జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజే శారు. కార్యక్రమంలో అమరావతి కరస్పాండెంట్ కె.సురేష్, గాయత్రి స్కూల్ ప్రిన్సి పాల్ చంద్రబాబు, విజేత కరస్పాండెంట్ కామాక్షి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెంకటాచలం : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వ ర్యంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్య క్రమంలో వర్సిటీ వీసీ సుందరవల్లి, రిజిస్ట్రార్ పి.రామచంద్రారెడ్డి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ ఆనంద్‌కుమార్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ విద్యా ప్రభాకర్ పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాళెం : సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన జీవనదీపం యోగి వేమన అని ఎంఈవో దిలీప్‌కుమార్ అన్నారు. బుచ్చి నగర పంచాయతీ రామచంద్రాపురం ప్రాఽథమికోన్నత పాఠశాలలో వేమన జయంతిని నిర్వహించారు. ముందుగా వేమన చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. వేమన ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. వేమన పద్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో రామచంద్రాపురం పాఠశాల ఉండడం గర్వకారణమన్నారు. అనంతరం పద్యపోటీలు నిర్వహించి విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, వేమన శతకాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసులురెడ్డి, జిల్లా రిసోర్సు సభ్యులు గండికోట సుధీర్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైదాపురం : యోగి వేమన జయంతి సందర్భంగా గురువారం ఎంపీ డీవో కార్యాలయంలో ఎంపీడీవో పురుషోత్తం శివకుమార్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగివేమన పద్యాలను యువత ఆదర్శంగా తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాపూరు : రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో ్ఠ్ఠగురువారం యోగి వేమన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాలలతో అలంకరించి అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు.
వేమన జయంతి వేడుకలు
ఉదయగిరి రూరల్, జనవరి 19: స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో గురువారం యోగివేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేమన చిత్రపటానికి ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వేమన పద్యాలు తెలియని వారుండరన్నారు. ఎన్నో అర్థవంతమైన పద్యాలను రచించారన్నారు. ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకోవాలన్నారు. అనంతరం కార్యక్రమంలో ఏవో రేణుక, ఈవోపీఆర్డీ మల్లికార్జున, ఏపీవో వెలుగోటి శ్రీనివాసులు, ఇమ్రాన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉదయగిరి : మండలంలోని అన్ని ప్రభుత్వ పాటశాలల్లో యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని గడ్డంవారిపల్లి, కృష్ణంపల్లి, అప్పసముద్రం, గండిపాళెం, వెంగళరావునగర్, బిజ్జంపల్లి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.