Yuvagalam Padayatra : ఏఐతో యువగళంలో కొత్త ప్రయోగం
ABN , First Publish Date - 2023-07-19T13:47:48+05:30 IST
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో యువగళంలో కొత్త ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా డిజైన్ చేశారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ టీడీపీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.
అమరావతి : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో యువగళంలో కొత్త ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా డిజైన్ చేశారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ టీడీపీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. కనిగిరిలో నారా లోకేష్ యువగళం పాదయాత్రపై షెడ్యూల్ వివరిస్తూ కృత్రిమ యాంకర్ వైభవి వార్తలు చదివారు. యువగళం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్‌తో వార్తల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్డేట్స్ ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయపార్టీల చరిత్రలో తొలి ఎఐ యాంకర్ కాన్సెప్ట్ తమదేనని టీడీపీ చెబుతోంది.