NCBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై తాజా బులెటిన్.. ఒక్కసారి క్లారిటీగా పరిశీలిస్తే..
ABN , First Publish Date - 2023-10-16T20:42:43+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారుల, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని.. అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని బాబు కుటుంబం కంగారు పడుతోంది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారుల, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని.. అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని బాబు కుటుంబం కంగారు పడుతోంది. ఇప్పటికే డీ హైడ్రేషన్, చర్మ సంబంధిత అలర్జీ రావడంతో, బరువు ఒక్కసారిగా తగ్గిపోవడంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఓ వైపు జైలు అధికారులు, మరోవైపు వైద్యాధికారులు.. ఇంకోవైపు వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మీడియా ముందు మాట్లాడుతుండటంతో అసలు సెంట్రల్ ఏం జరుగుతోందని సామాన్యుడు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
తాజా బులెటిన్..
ఈ పరిస్థితుల్లో రోజువారీగా చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. తాజా బులెటిన్‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. నిన్నటికీ, ఇవాళ్టికీ చాలా తేడాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆదివారంతో పోలిస్తే.. సోమవారం నాటికి బీపీ, పల్స్ రేటు మారింది. అయితే బరువు మాత్రం 67 కేజీలే ఉన్నట్లు బులెటిన్‌లో అధికారులు రాసుకొస్తున్నారు. ఇటీవల చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. దీంతో అప్పట్నుంచి బాబు ఆరోగ్యంపై ఫ్యామిలీకి ఇంకాస్త ఆందోళన పెరిగింది.
ఇవాళ్టి హెల్త్ బులెటిన్‌లో ఏముంది..?
15 తారీఖు బులెటిన్‌లో ఇలా..?
ఏం జరుగుతుందో..?
ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో (ACB court) ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదని పిటిషన్‌లో లాయర్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందంటూ పిటిషన్లలో న్యాయవాదులు ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపడతానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే.. కోర్టు ఏం చెబుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.