AP News: మరోసారి నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి కంటతడి

ABN , First Publish Date - 2023-06-16T13:18:51+05:30 IST

నందిగామ పురపాలక సంఘంలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ చట్టంలోని రిక్విజేషన్ పేరుతో సమావేశం ఏర్పాటు వివాదానికి కారణంగా నిలిచింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహిళనని చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రతిసారీ అవమాన పరుస్తున్నారన్నారంటూ కంటతడిపెట్టారు.

AP News: మరోసారి నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి కంటతడి

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ పురపాలక సంఘంలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ చట్టంలోని రిక్విజేషన్ పేరుతో సమావేశం ఏర్పాటు వివాదానికి కారణంగా నిలిచింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి (Nandigama Municipal Chairperson Mandava Varalakshmi) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహిళనని చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రతిసారీ అవమాన పరుస్తున్నారన్నారంటూ కంటతడిపెట్టారు. మున్సిపల్ కమిషనర్ లాగా కాకుండా, ఒక రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెలాఖరులో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఐదు అంశాలను చర్చిద్దామని అనుకుంటే ముందుగానే ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్తున్నారని.. ఈ విధంగా తనను అవమానించడం ఏ రకంగా సమంజసమని మండవ వరలక్ష్మి ప్రశ్నించారు. కాగా ఈ సమావేశానికి ముందు కౌన్సిల్ సభ్యులు... చైర్మన్‌ను కలిసి సమావేశానికి రావాల్సిందిగా కోరారు. అందుకు అంగీకరించని వరలక్ష్మి చైర్మన్ రూమ్‌లోనే ఉండిపోయారు. దీంతో చేసేదేమీ లేక కౌన్సిల్ సభ్యులు కాసేపటికే సమావేశ మందిరానికి వెళ్లిపోయారు.

కాగా.. కొద్ది రోజుల క్రితం కూడా మున్సిపల్ చైర్‌పర్సన్ కన్నీటి పర్యంతమయ్యారు. నగర పంచాయతీ అధికారులు తనకు ఏమాత్రం గౌవరం ఇవ్వడం లేదంటూ ఏకంగా ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు ముందు ఆవేదన చెందారు. నగర పంచాయతీ బడ్జెట్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు ఎజెండా కాపీని కూడా ఇవ్వలేదని.. కార్యాలయం నుంచి ఏ సమాచారం తనకు ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు. దీనిపై కమిషనర్, సిబ్బంది నుంచి ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజాగా మున్సిపల్ చట్టంలోని రిక్విజేషన్ పేరుతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2023-06-16T13:18:51+05:30 IST