Pawan Kalyan: వైసీపీని ఎదిరించి నిలబడటం చిన్న విషయంకాదు.. రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పాలన

ABN , First Publish Date - 2023-09-16T19:59:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: వైసీపీని ఎదిరించి నిలబడటం చిన్న విషయంకాదు.. రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పాలన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.


"సీఎంగా ఉంటే ఇష్టం వచ్చినట్లు చేస్తే కరెక్ట్ కాదు. సంక్షేమ పధకాలు జగన్ వచ్చాకే అమలు కావడం లేదు. ఎన్నో దశాబ్దాలుగా పాలకులు సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరం. అందుకే కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో అన్నాను. జగన్ ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు. మీకు సిగ్గుందా... ఏమైనా దిగి వచ్చారా. శివుడు...‌వీర భద్రుడిని ఎలా కొట్టాడో అలా ప్రజలు కొట్టగలరు. అధికార మదంతో తమాషాలు చేస్తారా. జగన్‌కు వంత పాడే అధికారులు గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఎంతటి పోరాటానికి అయినా సిద్దం. నేను సంయమనం పాటిస్తా. అది చేతకానితనం అనుకోవద్దు. నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను... మీరే రెచ్చ గొడుతున్నారు. 151 స్థానాలు గెలిచిన జగన్‌ను సర్ అని సంబోందించాం. ఆ విలువ ఉంచుకోలేదే... బూతులు తిట్టారు... తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. " అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వైఎస్సార్ విభజన జరిగితే పాస్ పోర్ట్ అవసరం అన్నారు. ఆయన కొడుకు జగన్ ఏపీలోకి రావాలంటే పాస్ పోర్ట్ అడుగుతున్నాడు. నేను ప్రజల కోసం రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్దం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ‌చదివిన వారూ ఆలోచన చేయండి‌.. మీరు చేసేది సబబా. ఎస్సీ, ఎస్టీ కేసులు, హత్యాయత్నం కేసులు అమాయకులపై పెడతారా. ప్రజలకు కోపం వస్తే... నీ ఆస్తులు కూడా నిన్ను కాపాడలేవు. మరి శృతి మించితే ప్రజలే కొట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి. మీరు మర్డర్ లు, రౌడీయిజం చేస్తారు... మమ్మలను రోడ్ల మీదకు వద్దంటారా. ముఖ్యమంత్రి అవగానే కొమ్ములు వచ్చేస్తాయా. నన్ను ఎందుకు అరెస్టు చేస్తారు... జాతీయ రహదారిపై ఆగిన ట్రాఫిక్‌కు జగన్ బాధ్యత వహించాలి." అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


"వైసీపీ రాక్షస పాలనను ఎదిరించి నిలబడటం చిన్న విషయంకాదు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీనే ఇబ్బందులు పెడుతున్నారు. వైసీపీ ఆలోచనా విధానాన్ని ఎదుర్కోవాలంటే రాజ్యాంగం తెలుసుకోవాలి. కాలాన్ని బట్టి మారేదే సనాతన ధర్మం. ద్వేషంతో కూడిన వాదన చేసేవారు బలవంతులు అనిపిస్తారు. ద్వేషం, దోపిడీ కొంతకాలం ఉండి.. కాల గర్భంలో కలిసిపోతాయి. ప్రతిపక్ష నేతలపై ఎన్ని కేసులు పెడతారు?. కేసుల పెడితే భయపడతామా?. సీఎం పదవి ఉందని ఓ ఫీలై పోవద్దు. జగన్‌.. నువ్వేమైనా దిగొచ్చావా?, నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత?." అని జగన్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

ధర్మాన్ని ‌పాటించి ప్రేమగా వచ్చే వారే మంచి పాలన అందిస్తారని, సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇతర కులాలకు తాను వ్యతిరేకం కాదని పవన్ కల్యాణ్ అన్నారు.

Updated Date - 2023-09-16T20:05:06+05:30 IST