Pawan Kalyan: జనసేన కార్యకర్త మృతి బాధాకరం.. రూ. 5 లక్షల పరిహారం.. ఈ ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే..

ABN , First Publish Date - 2023-07-25T19:29:34+05:30 IST

జనసేన పార్టీ తరఫున వసంత కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Pawan Kalyan: జనసేన కార్యకర్త మృతి బాధాకరం.. రూ. 5 లక్షల పరిహారం.. ఈ ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే..

అమరావతి: జనసేన కార్యకర్త మృతిపై (Janasena worker death) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యుత్ ప్రమాదానికి గురై జనసేన కార్యకర్త గొర్ల వసంత కుమార్ మరణించడం చాలా బాధ కలిగించిందన్నారు. 27 ఏళ్ల వసంత కుమార్ ప్రజా సేవలో చురుకుగా ఉంటాడని, విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని కంప్లైంట్ చేయటానికి వీడియో తీస్తుండగా ఈ ప్రమాదం జరిగి మరణించడం శోచనీయమన్నారు.


గతంలో కూడా ఇదే విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు వసంత కుమార్ ఫిర్యాదు కూడా చేశాడని, విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక జనసేన నాయకులు చెబుతున్నారని పవన్ తెలిపారు. జనసేన పార్టీ తరఫున వసంత కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Updated Date - 2023-07-25T19:30:27+05:30 IST