TarakaRatna: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి : పవన్

ABN , First Publish Date - 2023-01-27T20:46:04+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న (Tarakaratna) అస్వస్థతకు గురయ్యారు..

TarakaRatna: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి : పవన్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న (Tarakaratna) అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తారకరత్న కుప్పకూలిపోయారు. హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించడంతో యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు స్టంట్ వేశారు. తారకరత్న హార్ట్‌లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. తారకరత్నను కుప్పం హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని (Bangalore) ప్రముఖ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

త్వరగా కోలుకోవాలి..

తారకరత్న త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. (Pawan kalyan) ఓ ప్రకటన విడుదల చేశారు.నందమూరి తారకరత్న కుప్పంలో (Kuppam) తీవ్ర అస్వస్థతకు గురవ్వడం బాధాకరం. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నం కావాలిఅని పవన్ ఆకాంక్షించారు.

Pawan-on-Taraka-Ratna.jpg

మరోవైపు.. లోకేష్ పాదయాత్రలో ఉన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna), టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి తారకరత్న.. నారా లోకేష్‌ వెంట ఉండి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇవాళ.. కుప్పం మసీదులో లోకేష్‌తో పాటు తారకరత్న ప్రార్థనలు కూడా చేశారు. మసీదు నుంచి బయటకు వస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. మాసివ్ స్ట్రోక్‌ (Heart Attack) రావడంతో తారకరత్న కుప్పకూలిపోయారు.

Updated Date - 2023-01-27T20:49:34+05:30 IST