Home » Nandamuri Balakrishna
నొప్పి లేకుండా రోగులకు శస్త్రచికిత్సలు చేసేందుకు దోహదపడే డా విన్సీ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని..
Nandamuri Balakrishna: హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణను పద్మ పురస్కారం వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను పద్మ భూషణ్ పురస్కారాన్ని ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Nandamuri Balakrishna: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్ర సర్కార్ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు పొందిన హీరో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.
NTR Death Anniversary:ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ను మరచిపోలేరని బాలకృష్ణ ఉద్ఘాటించారు.
సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.
ప్రపంచ నలు మూలల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనే భరోసా కల్పించే విధంగా హైదరాబాద్లో హెల్త్ టూరిజం హబ్ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
వారాహి చలన చిత్ర అధినేత, ‘ఈగ - లెజెండ్’ వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం ‘అమ్మణ్ణి’ గ్రంధాన్నిఆంధ్రప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్కు, ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటికి హిందూపూర్ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని ఆయన సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.
ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది.