నల్లమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

ABN , First Publish Date - 2023-07-25T22:45:06+05:30 IST

ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, ట్రి ప్పర్‌ ఢీకొని నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.సంఘటన తుమ్మలబైలు - చిన్నారుట్ల మధ్య శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో మంగళవారం జరిగింది.

నల్లమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం
బస్సు, టిప్పర్‌ ఢీకొట్టడంతో నిలిచిన ట్రాఫిక్‌

ఆర్‌టీసీ బస్సు - టిప్పర్‌ ఢీ

పలువురికి స్వల్పగాయాలు

2 గంటలు నిలిచిన రాకపోకలు

పెద్ద దోర్నాల, జూలై 25 : ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, ట్రి ప్పర్‌ ఢీకొని నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.సంఘటన తుమ్మలబైలు - చిన్నారుట్ల మధ్య శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తుండగా చిన్నారుట్ల సమీపంలో శ్రీశైలం నుంచి దోర్నాల వైపు ప్రయాణిస్తున్న టి ప్పర్‌ వేగం అదుపుతప్పి ఢీకొని రోడ్డుకు అడ్డంగా తిరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు రెండు గంటల పాటు స్తంభించాయి. రెండు వాహనాల ముందు భాగం దెబ్బతిన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. 108 ఆంబులెన్స్‌ వాహనంలో క్షతగాత్రులను సుండిపెంట వైద్యశాల కు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై అంకమరావు సి బ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను ప క్కకు తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఎస్సై కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-07-25T22:45:06+05:30 IST