ఏపీజీబీలో ఇంటి నుంచే బ్యాంక్ అకౌంట్
ABN , First Publish Date - 2023-07-07T01:10:47+05:30 IST
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో (ఏపీజీబీ) డీజీ ఖాతా యాప్ ద్వారా ఇంటి నుంచే బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకోవచ్చని ఏపీజీబీ చైర్మన్ రాకేష్ కశ్యప్ తెలిపారు.
మార్కాపురం వన్‌టౌన్, జూలై 6: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో (ఏపీజీబీ) డీజీ ఖాతా యాప్ ద్వారా ఇంటి నుంచే బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకోవచ్చని ఏపీజీబీ చైర్మన్ రాకేష్ కశ్యప్ తెలిపారు. స్థానిక నెహ్రూ బజార్‌లో ఏపీజీబీ రీజినల్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచానికి తగినట్లుగా డిజిటల్ కార్యాకలాపాలు తమ బ్యాంకులో ప్రవేశపెట్టామన్నారు. వ్యాపార నిర్వాహణే కాకుండా సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా, సురక్షా భీమా, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలను ఖాతాదారులుగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు ద్వారా అకౌంట్ ప్రారంభించుకొని బ్యాంకు వద్దకు రాకుండానే ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చన్నారు. డిపాజిట్లపై కూడా అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలోని 50 శాఖలు నూతన రీజినల్ ఆఫీస్ కిందకు వస్తాయన్నారు. రుణవితరణ సులభం చేసేందుకు సరళరుణ కేంద్రం అనే వ్యవస్థను ప్రారంభిస్తున్నామన్నారు. 14 మంది ఖాతాదారులకు రూ.3 కోట్ల వివిధ రుణాలను చైర్మన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు, మార్కాపురం రీజనల్ మేనేజర్లు హేమలత, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతుమాధవన్, ఏపీజీబీ మేనేజర్లు సంతోష్, మురళీ తదితరులు పాల్గొన్నారు.