టీచర్‌ అభ్యర్థుల భిక్షాటన

ABN , First Publish Date - 2023-08-26T01:06:18+05:30 IST

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు కల్పించాలని డీఎస్సీ-98 అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

టీచర్‌ అభ్యర్థుల భిక్షాటన
భిక్షాటన చేస్తున్న డీఎస్సీ-98 అభ్యర్థులు

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 25: ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు కల్పించాలని డీఎస్సీ-98 అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు కలెక్టరేట్‌ ఎదుట నిరసనకు దిగారు. అనంతరం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ 25ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అశువులు బాశారన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి మిగిలిన వారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాల్లో రోస్టర్‌ పాటించని కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లాలో 726 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి కేవలం 165మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మరో 561మందికి ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయినందున సత్వరమే ప్రభుత్వం స్పందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గోవిందరావు, రత్నబాబు, జయరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-26T01:06:18+05:30 IST