Share News

చర్చీలలో క్రిస్మస్‌ ప్రార్థనలు

ABN , Publish Date - Dec 25 , 2023 | 01:28 AM

క్రీస్తు సూచించిన ప్రేమ, దయ, కరుణ మార్గంలో ప్రపంచ మానవాళి ముందుకు నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

చర్చీలలో క్రిస్మస్‌  ప్రార్థనలు

కంభం, డిసెంబరు 24 : క్రీస్తు సూచించిన ప్రేమ, దయ, కరుణ మార్గంలో ప్రపంచ మానవాళి ముందుకు నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి కంభం మండలం యర్రబాలెం గామ్రంలో టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు ఏర్పాటు చేసిన సెమిక్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రీస్తు మార్గం అందరికీ ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడిచే సేవకులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపి కేక్‌ కట్‌ చేశారు. ఫాస్టర్లకు, మహిళలకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఫాస్టర్లు పాల్గొన్నారు.

కంభం : సోమవారం జరిగే క్రిస్మస్‌ వేడుకలకు కంభం పట్టణంలోని పలుచర్చిలు విద్యుత్‌ కాంతులతో ముస్తాబయ్యాయి. కంభం ఏబీఎం చర్చి, సివిఆర్‌ చర్చి, పలు చర్చిలు క్రిస్మస్‌ పండుగకు ముస్తాబయ్యాయి.

పొదిలి : క్రిస్మ్‌స్‌ పండుగను పురష్కరించుకొని పట్టణం, మండలంలోని పలు చర్చీలు విద్యుత్‌ దీపాలతో ముస్తాబయ్యాయి. పట్టణంలోని అతిపురాతణ చరిల్లో తెలుగు బాప్టీస్ట్‌ చర్చి ఒకటని సంఘ పెద్దలు చెబుతున్నారు. అదే విధంగా మార్కపురం అడ్డరోడ్డులోని చర్చీ, బెస్తాపాలెం, నిర్మలాకాన్వెంట్‌, కంభాలపాడు, పోతవరం, మల్లవరం, ఉప్పలపాడు, తళమల్ల గ్రామాల్లో చర్చీలు సోమవారం జరగనున్న క్రిస్మ్‌స్‌ వేడుకలకు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. క్రీస్తూ జన్మదిన సందర్భంగా సోమవారం అధిక సంఖ్యలో క్రైస్తవసోదరులు పాల్గొని ప్రత్యేక ప్ర్ధానలు చేయనున్నారు. 1894లో అప్పటి బ్రిటీష్‌ పాలకులు తెలుగు బాప్టీస్ట్‌ చర్చి సుమారుగా 100 ఏళ్ళ క్రితం నిర్మించారని సంఘ పెద్దలు నాగే శ్వరరావు తెలిపారు.

క్రిస్మస్‌కు సర్వం సిద్దం

మార్కాపురం వన్‌టౌన్‌ : క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకుని సర్వం సిద్ధం చేశారు. పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్‌ టౌన్‌ చర్చ్‌, నగర్‌ చర్చి, పాలెం చర్చి, లూథరన్‌ చర్చి, రైల్వే స్టేషన్‌ రోడ్డులోని ఆర్సీఎం చర్చిలతో పాటు పలు చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

యూత్‌ ఆధ్వర్యంలో సేవా కార్యాక్రమాలు

మార్కాపురం వన్‌టౌన్‌, : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఏబీఎం కాంపౌండ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వైద్యశాలలో రోగులకు, పండ్లు, బ్రెడ్లు స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాలలో సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ దారివేముల హర్షితాబాబీ, ప్రమోద్‌, కిరణ్‌, ఎర్నెస్ట్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల : క్రైస్తవులు పవిత్రంగా భావించే క్రిస్మస్‌ పండుగకు చర్చీలన్నీ ముస్తాబయ్యాయి. ఏసుక్రీస్తు పుట్టిన సందర్భంగా ఏటా డిసెంబరు 25న క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాచర్లలోని ఆర్‌సీఎం, ఏబీఎం, పుల్లలచెరువులోని చర్చి, అన్ని చోట్ల దీపాలతో అలంకరించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చర్చిల ఆవ రణలో నమూనాలు కనువిందు చేస్తున్నాయి.

దుస్తుల అందజేత

గిద్దలూరు : మండలంలోని ఓబులాపురం గ్రామంలో క్రిస్మస్‌ పర్వదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వృద్ధులు, పిల్లలకు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో దాతలు యోహాన్‌, జయమ్మ, ఫాస్టర్‌ ఏసురత్నం, బ్రదర్‌ జగన్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 01:28 AM