ఆర్టీసీ బస్టాండ్‌లలో అద్దె షాపులకు పోటీ

ABN , First Publish Date - 2023-01-22T22:29:58+05:30 IST

ఆర్టీసీ బస్టాండ్‌ లలో షా పులు, ఖాళీ స్థలాలు అద్దెలకు తీసుకునే టెండర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఊహించిన దానికంటే అధిక రేట్‌లతో టెండర్‌లు వేశారు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌ తో పాటు బల్లికురవ బస్టాండ్‌లో కూడా షాపులను ఏ ర్పాటు చేసుకునేందుకు టెండర్‌లు పిలిచారు.

ఆర్టీసీ బస్టాండ్‌లలో అద్దె షాపులకు పోటీ
అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు

ఊహించిన దాని కంటే అధిక మొత్తానికి టెండర్‌లు

అద్దంకి, బల్లికురవలో 20 ఏళ్ల తర్వాత భారీ డిమాండ్‌ అత్యధికంగా రూ.42వేలు

పలికిన బియ్యం దుకాణం

అద్దంకి, జనవరి 22 : ఆర్టీసీ బస్టాండ్‌ లలో షా పులు, ఖాళీ స్థలాలు అద్దెలకు తీసుకునే టెండర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఊహించిన దానికంటే అధిక రేట్‌లతో టెండర్‌లు వేశారు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌ తో పాటు బల్లికురవ బస్టాండ్‌లో కూడా షాపులను ఏ ర్పాటు చేసుకునేందుకు టెండర్‌లు పిలిచారు. ఈ క్ర మంలో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఒంగోలు లోని ఆర్‌ఎం కార్యాలయంలో టెండర్‌ల ప్రక్రియ కొన సాగింది. అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో 20 సంవత్సరాల క్రితం కట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 10 గ దులతో పాటు బస్టాండ్‌ లోపల పలు దుకాణాలకు కూడా టెండర్‌లు దాఖలయ్యాయి. మొత్తం 22 దుకా ణాలకు 35 మంది టెండర్‌ లు దాఖలు చేశారు. వీరిలో అత్యధిక శాతం ఇప్పటివరకు దుకాణాలు నిర్వ హిస్తున్న వ్యక్తులే మరలా టెండర్‌లు వేసినట్లు తె లుస్తుంది. నామ్‌రోడ్డు వెంబడి ఉన్న 10 షాపులకు 20 సంవత్సరాల క్రితం టెండర్‌ లు పిలిచి, అనంతరం ఏ టా కొంత మేర అద్దె పెంచుతూ అదే వ్యాపారులకు కే టాయిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో షాపు కు నెలకు అద్దె రూ.15వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుత టెండర్‌ లలో ఓ బియ్యం దుకాణం నిర్వహించేందుకు అత్య ధికంగా రూ.42 వేలకు టెండర్‌ దాఖలు చేశారు. ఈ 10 దుకాణాలకు రూ.19 వేల నుంచి రూ.42 వేల వరకు అద్దెతో టెండర్లు వేశారు. ఇక బస్టాండ్‌ ఆవరణ లోపల దుకాణాలకు కూడా తక్కువ అద్దెతో టెండర్లు వేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక అద్దెలతో టెండర్‌లు వేయటం పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది. గతం కంటే రెట్టింపు ఆదాయం ఆర్టీసీ కి రానుంది.

బల్లికురవ బస్టాండ్‌లోనూ మంచి డిమాండ్‌

ఇప్పటి వరకు ఖాళీగా నిరుపయోగంగా ఉన్న బల్లికురవ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో షాపుల ఏ ర్పాటుకు మంచి డిమాండ్‌ వచ్చింది. రోడ్ల విస్తరణ పేరుతో అద్దంకి, మార్టూరు రోడ్ల వెంబడి ఉన్న దుకాణాలను తొలగించడంతో ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకొని దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వ్యక్తులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మొత్తం 28 షాపుల ఏర్పా టుకు ఆర్టీసీ అధికారులు టెండర్‌లు పిలవగా 4 షా పులకు ఎవరూ టెండర్‌లు వేయలేదు. మిగిలిన 24 దుకాణాలకు 43 మంది టెండర్‌లు వేశారు. నెలకు రూ.3 వేల నుంచి అత్యధికంగా రూ.10 వేల వరకు అద్దె చెల్లించే విధంగా టెండర్‌లు వేశారు. ఇప్పటి వరకు నయా పైసా ఆదాయం రాని బల్లికురవ ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీ స్థలానికి ఇక నుంచి అద్దెల రూపంలో నెలవారీ సుమారు లక్ష రూపాయల పైనే ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడింది.

Updated Date - 2023-01-22T22:30:03+05:30 IST