మార్టూరులో క్షుద్రపూజల కలకలం

ABN , First Publish Date - 2023-03-01T23:36:42+05:30 IST

మార్టూరులోని రామ్‌నగర్‌, నేతాజీ నగర్‌ కూడలి నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే మట్టిరోజు నుంచి తూర్పు వైపు ఉన్న వాగుకు వెళ్లే రోడ్‌లో బుధవారం ఉదయం క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ క్షుద్రపూజలు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రదేశంలో కొబ్బరికాయ, రెండు నిమ్మ కాయలు, పసుపు కుంకుమ, ఒక దిండు దానిపైబొమ్మ ఆకారంలో గీసిన బొమ్మలు, పాత దుస్తులు ఉన్నాయి. అయితే కొబ్బరి కాయ కింద ఒక ఫొటో ఉంది. ఈ ఫొటో లో 60 ఏళ్ల వయసుపై బడిన దంపతులు, వారి వెనుక సుమారు 9 ఏళ్ల వయస్సున్న పాప ఫొటో ఉంది.

  మార్టూరులో క్షుద్రపూజల కలకలం
క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాలు

మార్టూరు,మార్చి 1: మార్టూరులోని రామ్‌నగర్‌, నేతాజీ నగర్‌ కూడలి నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే మట్టిరోజు నుంచి తూర్పు వైపు ఉన్న వాగుకు వెళ్లే రోడ్‌లో బుధవారం ఉదయం క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ క్షుద్రపూజలు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రదేశంలో కొబ్బరికాయ, రెండు నిమ్మ కాయలు, పసుపు కుంకుమ, ఒక దిండు దానిపైబొమ్మ ఆకారంలో గీసిన బొమ్మలు, పాత దుస్తులు ఉన్నాయి. అయితే కొబ్బరి కాయ కింద ఒక ఫొటో ఉంది. ఈ ఫొటో లో 60 ఏళ్ల వయసుపై బడిన దంపతులు, వారి వెనుక సుమారు 9 ఏళ్ల వయస్సున్న పాప ఫొటో ఉంది. అంతేగాకుండా ఫొటో వెనుక ఒక ఫోన్‌ నంబరు ఉంది. ఈ నంబరుకు కొంతమంది ఫోన్‌ చేయగా అది ఒడిసా రాష్ట్రానికి వెళ్లినట్లుగా సమాచారం. ఆ ఫొటోలో ఉన్న వారు ఈ ప్రాంతానికి చెందిన వారుగా ప్రజలు భావిస్తున్నారు. క్షుద్రపూజలు జరిగిన రోడ్డు నుంచి రోజూ స్థానికంగా ఉండే వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు పొలం పనుల నిమిత్తం వెళుతుంటారు. వారు ఈ క్షుద్రపూజల తతంగం తెలియగానే ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.

Updated Date - 2023-03-01T23:37:07+05:30 IST