ఘనంగా సంక్రాంతి సంబరాలు
ABN , First Publish Date - 2023-01-16T23:49:13+05:30 IST
సంక్రాంతి సం దర్భంగా ఆది, సోమవారంలలో పలు పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. శింగరకొండలోని శ్రీప్రస న్నాంజనేయస్వామికి స్వర్ణాభరణాలతో అలంకరించారు.
అద్దంకి, జనవరి 16: సంక్రాంతి సం దర్భంగా ఆది, సోమవారంలలో పలు పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. శింగరకొండలోని శ్రీప్రస న్నాంజనేయస్వామికి స్వర్ణాభరణాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిం చారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో రామాలయం వద్ద ఆది వారం రా త్రి ఏర్పాటుచేసిన భజన ఆకట్టుకుంది. ముగ్గుల పోటీలు నిర ్వహించి విజేతలకు రిటైర్డ్ డీఎస్పీ బీరం నాగేశ్వరరావు బహుమతులు అందజేశారు. ధన్వంతరి దత్తపాదుకాక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కనుమ సందర్భంగా సోమవారం ఉద యం పట్టణంలోని వాసవినగర్‌లో ఉన్న హరిహర గోకులంలో గోపూజ కార్యక్ర మం నిర్వహించారు. టీడీపీ పట్టణ నా యకుడు గార్లపాటి శ్రీనివాసరావు దంప తుల ఆధ్వర్యంలో పూజాకార్యక్రమాలు జ రిగాయి. కార్యక్రమంలో హరిహర గోకు లం వేల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గోను గుంట్ల సుబ్బారావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, శేషారెడ్డి, మ న్నం త్రిమూర్తులు, నర్రా గోపాల్, పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి, దేసు పద్మేష్, చుండూరి మురళీసుధాకర్, నరసింహా రావు, వడ్లవల్లి ఆంజనేయులు, రామారావు, నాగసూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
చినగంజాంలో..
చినగంజాం, జనవరి 16: మండల పరిధిలోని గ్రా మాల్లో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. మున్నం వారిపాలెం గ్రామంలోని లక్ష్మణ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాల ను విశేషంగా అలంకరించి మున్నంవారిపాలెం, చినగంజాం, మూలగా నివారిపాలెం గ్రామ ప్రధాన వీధులలో మంగళవాయిద్యాలు, బాణాసం చాలతో ఊరేగింపు నిర్వహించారు. తదనంతరం బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగంణంలోని చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. సం క్రాంతి పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో దేవతామూర్తులను ప్ర త్యేకంగా అలంకరించి గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. కడవకుదురులో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించి మహిళలకు బహుమతుల ను అందజేశారు. పలు గ్రామాల్లో దేవతామూర్తు లను గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించి, తెప్పోత్స వాలను నిర్వహించారు.
చెరుకూరులో తెప్పోత్సవం
చెరుకూరు(పర్చూరు), జనవరి 16: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మండలంలోని చెరుకూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవిక్రమ, అగస్తేశ్వర స్వామివార్లకు సోమవారం తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివార్లను ప్రత్యేక వా హనంలో అలంకరించి మేళ తాళాలలో గ్రామోత్స వం నిర్వహించారు. అనంతరం స్థానిక మంచినీటి చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి నాగయ్య నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.