ఘనంగా సత్య జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-03-05T23:01:03+05:30 IST

టీడీపీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ 40వ జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.

ఘనంగా సత్య జన్మదిన వేడుకలు
సత్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్న టీడీపీ నాయకులు

కొండపి, మార్చి 5 : టీడీపీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ 40వ జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, జిల్లా నా యకులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గూడూరి ఎరిక్షన్‌బాబు, నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, ఎమ్మెల్సీ ఎన్నికల కొండపి నియోజకవర్గ పరిశీలకుడు మన్నవ మోహనకృష్ణ, కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా దామచర్ల సత్యనారాయణ కేక్‌ కట్‌ చేసి అందరికీ తినిపించారు. ఈసందర్భంగా సత్య మాట్లాడుతూ తాను 15 ఏళ్లుగా కీలకంగా పార్టీలో పనిచేస్తున్నానని, తన తాత నుంచి తన కుటుంబ సభ్యులకు వెన్నుదన్నుగా నిలిచి, దామచర్ల కుటుంబాన్ని ఆదరిస్తున్న జిల్లా, కొండపి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తమ కుటుంబానికి రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా టీడీపీలోనే కొనసాగుతున్నామని, తమ చివరి శ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతామన్నారు. తన తాత ఆంజనేయులు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రెండు దశాబ్దాలుగా తమ కుటుంబానికి అండగా ఉంటున్న టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నుంచి టంగుటూరు, కొండపి వరకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా సత్యవెంట పాల్గొన్నారు. కొండపిలోని కామేపల్లి రోడ్డు సెంటర్‌లో సత్య కేక్‌ కట్‌చేయగా ఆయన్ను గజమాలతో సన్మానించారు. అలాగే నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు, నాయకులు పూలమాలలతో, శాలువాలతో సన్మానించారు.

టంగుటూరులో..

టంగుటూరు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ(సత్య) జన్మదిన వేడుకలు ఆదివారం టంగటూరు మం డలంలో ఘనంగా జరిగాయి. ముందుగా సత్య ఉదయం తన తల్లిదండ్రులు పూర్ణచంద్రరావు, విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు స్వీకరించారు. అప్పటికే తన స్వగృహానికి చేరుకున్న కారుమంచి టీడీపీ నాయకుడు ఈదర ప్రభాకర్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రామాగోపి, జమ్ములపాలెం, కాకుటూరివారిపాలెం, వల్లూరు, ఎం నిడమలూరు, వాసేపల్లిపాడు టీడీపీ నాయకులు మక్కెన వెంకట్రావు, కొమ్మినేని వెంకట్రావు, బొజ్జా శ్రీనివాసరావు, కాకుమాని శ్రీకాంత్‌, దూడల తిరుపతిస్వామి, అనంతవరం ఉపసర్పంచ్‌ కసుకుర్తి భాస్కరరావు, మర్లపాడు మాజీ ఎంపీటీసీ మత్తినేని హరిబాబు, జమ్ములపాలెం మాజీ ఉపసర్పంచ్‌ కొత్తపల్లి వెంకటేశ్వర్లు కలసి సత్యను గజమాలతో ఘనంగా సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వగృహం నుంచి సత్య తన అభిమానులతో కలిసి టంగుటూరు మండలం వల్లూరులోని వల్లూరమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. వల్లూరు టీడీపీ నాయకుడు బొజ్జా శ్రీను ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నా యకులు సత్యకు ఘనంగా స్వాగతం పలికారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టంగుటూరులో మండల తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈకార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:01:03+05:30 IST