కనిగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..!
ABN , First Publish Date - 2023-02-22T22:38:30+05:30 IST
కనిగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధమని, మరి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నా రా అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ము క్కు ఉగ్రనరసింహారెడ్డి సవాల్ విసిరారు.
వైసీపీ నేతలకు ఉగ్ర సవాల్
పీసీపల్లి, ఫిబ్రవరి 22 : నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధమని, మరి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నా రా అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ము క్కు ఉగ్రనరసింహారెడ్డి సవాల్ విసిరారు. మండలంలోని మురుగుమ్మిలో మంగళవారం రాత్రి జరిగిన అడవి పేరంటాలమ్మ తిరునాళ్లలో ఆయన టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీ స్టేజీపై మాట్లాడారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. ము ఖ్యంగా నిమ్జ్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసుకోవాలని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పొగాకు రైతుల కోసం కనిగిరిలో బోర్డు ఏర్పాటు చేయించానన్నారు. అలాగే గొర్రెలమండి, పాలేటిపల్లి ప్రాజెక్టు, అలవలపాడు వద్ద పాలేరునదిపై బ్రిడ్జిలను నిర్మించడంతోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించానని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హ యాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్రిపుల్‌ఐటీని మంజూరు చేశారన్నారు. ఆ కాలేజీకి ప్రస్తు తం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు భవనాలను కూడా నిర్మించలేదన్నారు. వెలిగొండ ఆయకట్టు పరిధిలోకి పీసీపల్లి మండలాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను అందరికీ కట్టుభద్రుడిగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిని ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గెలిచిన అనంతరం గ్రామాల్లో మౌలికవసతులు కల్పించి ఇక్కడే ప్రజలకు ఉపాధి కల్పించి మన ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య, కసిరెడ్డి హనుమారెడ్డి, కసిరెడ్డి ఓబుల్‌రెడ్డి, పెద్దిరెడ్డి క్రిష్ణారెడ్డి, వెంగళాయపల్లి, నేరేడుపల్లి, గుదేవారిపాలెం సర్పంచ్‌లు కరణం తిరుపతయ్య, పల్లా మల్లికార్జున్, కనపర్తి శాంసన్, ముప్పూరి మాల్యాద్రి, ఏనుగంటి నాగేంద్రబాబు, ఫిరోజ్, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, పిచ్చాల శ్రీనివాసరెడ్డి, గుంటగాని జోసెఫ్, కోమటిగుంట్ల వీరయ్య, నెలకుర్తి మాలకొండయ్య పాల్గొన్నారు.