ఇన్‌చార్జ్‌ పాలనలో మండల పరిషత్‌ కార్యాలయం

ABN , First Publish Date - 2023-06-10T22:14:08+05:30 IST

ముండ్లమూరు మండల పరిషత్‌ కార్యాలయం ఇన్‌చార్జ్‌ పాలనలో కొనసాగుతోంది. ప్రధాన విభాగాలకు సైతం పూర్తిస్థాయి అఽఽధికారులు లేకపోవడం వలన పాలన వేగంగా సాగడం లేదు. అధికారులు రెగ్యులర్‌ మండలం చూసుకోవడంతోపాటు ఇక్కడ కూడా పాలన బాధ్యతలను చూడాల్సి ఉంది.

ఇన్‌చార్జ్‌ పాలనలో మండల పరిషత్‌ కార్యాలయం
ముండ్లమూరు మండల పరిషత్‌ కార్యాలయం

పాలనలో లోపించిన వేగవంతం

సకాలంలో పనులు కాక అవసరార్థులకు ఇబ్బందులు

ముండ్లమూరు, జూన్‌ 9 : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఇన్‌చార్జ్‌ పాలనలో కొనసాగుతోంది. ప్రధాన విభాగాలకు సైతం పూర్తిస్థాయి అఽఽధికారులు లేకపోవడం వలన పాలన వేగంగా సాగడం లేదు. అధికారులు రెగ్యులర్‌ మండలం చూసుకోవడంతోపాటు ఇక్కడ కూడా పాలన బాధ్యతలను చూడాల్సి ఉంది. మండల పరిషత్‌లో ప్రధాన పోస్టు ఎంపీడీవో. దర్శి ఎంపీడీవోగా పనిచేస్తున్న కుసుమకుమారి ముండ్లమూరు ఇన్‌చార్జి ఎంపీడీవోగా కొనసాగుతున్నారు. కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రామాంజనేయులు ఉద్యోగోన్నతిపై బాపట్ల జిల్లా పంగులూరు ఎంపీడీవో వెళ్ళారు. ఈవోఆర్‌డీగా పనిచేస్తున్న ఓబులేసు బదిలీపై కొరిశపాడు మండలానికి వెళ్లారు. ఎంఈవో పోస్టు ఇన్‌చార్జి పాలన కొనసాగుతోంది. దర్శి మండలం పోతవరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రమోహన్‌ ఇన్‌చార్జి ఎంఈవోగా కొనసాగుతున్నారు. పంచాయతీ రాజ్‌ ఏఈ పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. పొదిలి ఏఈ ఎం. వెంకటేశ్వర్లు ఇన్‌చార్జ్‌ ఏఈగా కొనసాగుతున్నారు. మండలంలోని ముఖ్యమైన పోస్టులన్నీంటిల్లో ఇన్‌చార్జులు కొనసాగుతున్నారు. పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ప్రజలకు సకాలంలో పనులు కావడం లేదు.

Updated Date - 2023-06-10T22:14:08+05:30 IST