సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై ప్రస్తావన

ABN , First Publish Date - 2023-02-22T00:22:15+05:30 IST

కంభం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ అధ్యక్షతన నిర్వహించారు.

సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై ప్రస్తావన

కంభం, ఫిబ్రవరి 21 : కంభం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై పెద్దగా ప్రస్తావన రాలేదు. అయినప్పటికీ, ప్రజాప్రతినిధులు తమప్రాంత సమస్యలను సమావేశం దృష్టిటికి తీసుకొచ్చారు. చిన్నకంభంలో జగనన్న కాలనీలో మినీ వాటర్‌ ట్యాంకును నాశిరకంగా నిర్మించారన్నారు. పడగొట్టి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని చిన్నకంభం సర్పంచ్‌ సయ్యద్‌ రసూల్‌ తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఎల్‌.కోట, తురిమెళ్లలో సచివాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిపేయడంతో వాటిలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అధికారులు నిర్మాణాలను పూర్తి చేయాలని ఎల్‌కోట, తురిమెళ్ల సర్పంచ్‌లు భాషా, సుభద్రలు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సమావేశం అరగంటలోనే ముగిసింది. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి, ఎంపీడీవో నరసయ్య, పంచాయతీరాజ్‌ ఏఈ ఆంజనేయరెడ్డి, ప్రభుత్వ వైద్యులు రసూల్‌, పశువైద్యాధికారి శివారెడ్డి, విద్యుత్‌ ఏఈ నరసయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T00:22:16+05:30 IST