Share News

అన్నా క్యాంటిన్‌ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2023-11-01T22:22:39+05:30 IST

కనిగిరిలో అన్నాక్యాంటిన్‌ తిరిగి బుధవారం పునఃప్రారంభం కావటంతో పేదలు ఆకలి తీర్చుకునేందుకు బారులుదీరారు.

అన్నా క్యాంటిన్‌ పునఃప్రారంభం
కాంటీన్‌లో భోజనం కోసం బారులుదీరిన పేదలు

ఎంతోమంది ఆకలి తీర్చుకున్న పేదలు

కనిగిరి, నవంబరు 1 : అన్నాక్యాంటిన్‌ తిరిగి బుధవారం పునఃప్రారంభం కావటంతో పేదలు ఆకలి తీర్చుకునేందుకు బారులుదీరారు. చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించటమే కాకుండా దుర్మార్గంగా జైలులో దుర్మార్గంగా జైలులో నిర్బంధించిన విషయం పాఠకులకు విదితమే. దీంతో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చంద్రబాబు అక్రమ అరెస్ట్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయనకు మద్దతుగా 53రోజులు పాటు నిరంతరంగా నిరసన దీక్షలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్‌ను కూడా 53రోజులు పాటు మూసివేసి నిరసన తెలిపారు. తిరిగి చంద్రబాబు మంగళవారం మధ్యంతర బెయిల్‌పై విడుదల కావటంతో బుధవారం నుంచి అన్న క్యాంటీన్‌ తిరిగి పునఃప్రారంభం కావటంతో పేదలు, కూలీలు, పాదచారులు అన్న క్యాంటిన్‌లో భుజించేందుకు బారులుదీరారు.

Updated Date - 2023-11-01T22:22:39+05:30 IST