ఐసీడీఎస్‌ పునర్‌వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2023-02-13T00:05:45+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. వాటిని అసెంబ్లీ నియోజకవర్గం పరిధికి లోబడి ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ ఒక్కో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు రెండు, మూడు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. మండలాల విషయంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పాలన, పర్యవేక్షణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఒకటి, మరికొన్ని చోట్ల రెండు ప్రాజెక్టులను ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తూ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జీవో నంబరు-2ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని ప్రాజెక్టులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసింది.

ఐసీడీఎస్‌ పునర్‌వ్యవస్థీకరణ
కనిగిరిలోని ఐసీడీఎస్‌ కార్యాలయం

కొన్నిచోట్ల పాతవి రద్దు చేసి

కొత్తవి ఏర్పాటు

ప్రభుత్వం ఉత్తర్వులు

ఒంగోలు నగరం, ఫిబ్రవరి 12 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. వాటిని అసెంబ్లీ నియోజకవర్గం పరిధికి లోబడి ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ ఒక్కో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు రెండు, మూడు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. మండలాల విషయంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పాలన, పర్యవేక్షణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఒకటి, మరికొన్ని చోట్ల రెండు ప్రాజెక్టులను ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తూ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జీవో నంబరు-2ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని ప్రాజెక్టులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసింది.

పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ప్రాజెక్టులు ఇలా..

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎర్రగొండపాలెంతోపాటు దోర్నాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. పుల్లలచెరువు, త్రిపురాంతంకం, ఎర్రగొండపాలెం మండలాల్లోని 221 అంగన్వాడీలు, 27 మినీ అంగన్వాడీలు కలిపి మొత్తం 248 కేంద్రాలను ఎర్రగొండపాలెం ప్రాజెక్టు కింద చేర్చారు. దోర్నాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కింద పెద్దారవీడు, దోర్నాల మండలాల్లోని 126 అంగన్వాడీ, 22 మినీ అంగన్వాడీలు కలిపి 148 కేంద్రాలను ఉంచారు. గిద్దలూరు నియోజకవర్గంలో బేస్తవారిపేట ప్రాజెక్టు కింద కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట.. గిద్దలూరు ప్రాజెక్టు కింద గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలు ఉన్నాయి. గిద్దలూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టును 233 కేంద్రాలతో, బేస్తవారపేట ప్రాజెక్టును 199 కేంద్రాలతో పునర్‌వ్యవస్థీకరించారు. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, పొదిలి ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. మార్కాపురం కింద మార్కాపురం, తర్లుబాడు మండలాలు, పొదిలి ప్రాజెక్టులో కొనకనమిట్ల, పొదిలి మండలాలు ఉన్నాయి. మార్కాపురం ప్రాజెక్టు కింద 208, పొదిలి ప్రాజెక్టులో 149 అంగన్వాడీ కేంద్రాలు ఉంచారు. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. కనిగిరి కింద కనిగిరి,పిసి పల్లి, పామూరు మండలాలు ఉండగా ఈ ప్రాజెక్టులో 238 అంగన్వాడీ కేంద్రాలు ఉంచారు. హెచ్‌ఎంపాడు, సి.ఎ్‌స.పురం, వెలిగండ్ల మండలాలు ఉండగా 205అంగన్వాడీ కేంద్రాలతో వెలిగండ్ల ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.

అతిపెద్ద ఐసీడీఎస్‌ ప్రాజెక్టుగా దర్శి

దర్శి కేంద్రంగా ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి ఆ నియోజకవర్గంలోని దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు వచ్చాయి. మొత్తం 334 అంగన్వాడీ కేంద్రాలతో జిల్లాలో అతిపెద్ద ఐసీడీఎస్‌ ప్రాజెక్టుగా ఇది ఏర్పాటైంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీనికింద మద్దిపాడు,చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో మొత్తం 280 అంగన్వాడీ కేంద్రాలు ఉంచారు. కొండపి నియోజకవర్గంలో కొండపి ప్రాజెక్టు కింద మర్రిపూడి, కొండపి, పొన్నలూరు మండలాల్లో 166 కేంద్రాలు ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో టంగుటూరు ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దాని కింద టంగుటూరు, శింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో 215 కేంద్రాలు ఉంచారు. ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు ప్రాజెక్టు కింద ఒంగోలు, కొత్తపట్నం, మండలాల్లో 274 కేంద్రాలు ఉన్నాయి. గతంలో ఉన్న అర్బన్‌, రూరల్‌ ప్రాజెక్టులు అన్నింటినీ ఎత్తేసి నియోజకవర్గాల పరిధిని చేసుకుని జిల్లాలో 13 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఒంగోలు నగరం, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా వాటిలో చేర్చారు. ఇక నుంచి అంగన్వాడీల సేవలు కొత్త ప్రాజెక్టు పరిధిలోనే జరగనున్నాయి.

Updated Date - 2023-02-13T00:05:48+05:30 IST