సీఎస్.పురం తహసీల్దార్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2023-05-14T00:17:51+05:30 IST
నిబంధనలకు విరుద్ధంగా రైతుల పేరు మీద భూములను ఇతరులకు ఆన్‌లైన్ చేసినట్లు విచారణలో తేలడంతో సీఎస్‌పురం తహసీల్దార్ బాలకిషోర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం కలెక్టర్ దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని రేగులచెలకలో పలు సర్వే నెంబర్లలో అక్రమంగా భూములకు సంబంధం లేని వ్యక్తుల పేరు మీద ఆన్‌లైన్ చేశారని గ్రామానికి చెందిన కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈ నెల 10వతేదీ నుంచి తహసీల్దార్ విధులకు దూరంగా ఉన్నారని కనిగిరి ఆర్డీవో తోట అజయ్‌కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ బాలకిషోర్‌పై విచారణకు కలెక్టర్ ఆదేశించారు.

సీఎస్‌పురం/ఒంగోలు(కలెక్టరేట్), మే 13 : నిబంధనలకు విరుద్ధంగా రైతుల పేరు మీద భూములను ఇతరులకు ఆన్‌లైన్ చేసినట్లు విచారణలో తేలడంతో సీఎస్‌పురం తహసీల్దార్ బాలకిషోర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం కలెక్టర్ దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని రేగులచెలకలో పలు సర్వే నెంబర్లలో అక్రమంగా భూములకు సంబంధం లేని వ్యక్తుల పేరు మీద ఆన్‌లైన్ చేశారని గ్రామానికి చెందిన కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈ నెల 10వతేదీ నుంచి తహసీల్దార్ విధులకు దూరంగా ఉన్నారని కనిగిరి ఆర్డీవో తోట అజయ్‌కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ బాలకిషోర్‌పై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజం కావడంతో బాలకిషోర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. వెలిగండ్ల తహసీల్దార్ సి.నాగార్జునరెడ్డికి సీఎస్‌పురం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలావుండగా తహసీల్దార్ బాలకిషోర్ భూఅక్రమాలపై గతంలో ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు తహసీల్దార్‌పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.