చంద్రబాబుపై కేసు అక్రమం

ABN , First Publish Date - 2023-09-16T23:09:44+05:30 IST

చంద్రబాబుపై పెట్టిన కేసే అక్రమం. కనీసం జైలులో కూడా కనీస వసతులు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, రిమాండ్‌ను ఖండిస్తూ స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో నాల్గోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కంభం, రాచర్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు.

చంద్రబాబుపై కేసు అక్రమం
రిలే దీక్ష శిబిరంలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు, సెప్టెంబరు 16 : చంద్రబాబుపై పెట్టిన కేసే అక్రమం. కనీసం జైలులో కూడా కనీస వసతులు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, రిమాండ్‌ను ఖండిస్తూ స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో నాల్గోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కంభం, రాచర్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు. దీక్ష శిబిరానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా చంద్రబాబును అరెస్టు చేశారని, 74 ఏళ్ళ వయస్సు గల చంద్రబాబు జైలులో వేడినీళ్ళు అందించక పోవడంతో చన్నీటితోనే స్నానం చేయాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఆయన భార్యకు కూడా ములాఖత్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు రోడ్లెక్కి నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అడ్డుకోవడం శోచనీయమన్నారు. రిలే దీక్ష శిబిరంలో కంభం, రాచర్ల మండలాల టీడీపీ అధ్యక్షులు తోటా శ్రీనివాసులు, కటికె యోగానంద్‌, టీడీపీ నాయకులు మల్లికార్జున్‌, లక్ష్మీరెడ్డి, చెన్నకేశవులు, జీవనేశ్వర్‌రెడ్డి, అహమ్మద్‌, నల్లబోతుల శ్రీనివాసులు, శిరిగిరి వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-16T23:09:44+05:30 IST