కేజీబీవీ సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలి

ABN , First Publish Date - 2023-02-07T23:16:00+05:30 IST

పనితీరు మెరుగు పర్చుకోవాలని జిల్లా గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (జీసీడీవో) సీహెచ్‌.మాధవీలత కస్తూ ర్బా పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశా లలో చదువుతున్న బాలికలు ఇటీవల అస్వ స్థతకు గురికావటం, టెన్త్‌ బాలిక సుప్రియ అనారోగ్యానికి గురై సోమవారం ఆసుపత్రిలో మృతి చెందిన ఘటనలపై మంగళవారం ఆ మె పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు.

కేజీబీవీ సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలి
విద్యార్థినులతో మాట్లాడుతున్న జీసీడీవో మాధవీలత

దొనకొండ, ఫిబ్రవరి 7 : పనితీరు మెరుగు పర్చుకోవాలని జిల్లా గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (జీసీడీవో) సీహెచ్‌.మాధవీలత కస్తూ ర్బా పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశా లలో చదువుతున్న బాలికలు ఇటీవల అస్వ స్థతకు గురికావటం, టెన్త్‌ బాలిక సుప్రియ అనారోగ్యానికి గురై సోమవారం ఆసుపత్రిలో మృతి చెందిన ఘటనలపై మంగళవారం ఆ మె పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచ నలు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం, వంట గది పరిసరాలు, పాఠశాల పరిసరాలను పరిశీలిం చారు. తరగతి గదుల్లోకి వెళ్లి ఉపాధ్యాయులు బోధన తీరును గమనించారు. సిలబస్‌ ఎంత వరకు పూర్తి చేశారు, విద్యాభివృద్ధి ఏవిధంగా ఉన్నదీ, భోజనం, సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన బా లికలకు మంచి సౌకర్యాలతో మెరుగైన బోధ న అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కెజీ బీవీ లను ఏర్పాటు చేసిందని మాధ వీలత చెప్పారు. ఇటీవల జరిగిన సంఘటనలకు ఎవరై అధైర్య పడకుండా చదువుకోవాలని కోరా రు. తల్లితండ్రులు పాఠశాల నిర్వ హణపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. పాఠశాలలో చదు వుకునే బాలికలకు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమైన బోధన, మెనూ ప్రకారం భోజనం, సౌక ర్యాలలో ఎటువంటి లోపాలు లే కుండా పాఠశాల నిర్వహించేలా సిబ్బందికి సూచనలు, హెచ్చరికలు చేశారు. తాము ని త్యం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో ఎంఈవో సాంబశివరావు, పాఠశాల ప్రత్యేకాధికారి అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T23:16:03+05:30 IST