రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2023-06-08T22:03:19+05:30 IST
టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చేది టీడీపీనని అన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే అది సాధ్యమన్నారు.
కొత్తపేట(చీరాల), జూన్ 8: టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చేది టీడీపీనని అన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే అది సాధ్యమన్నారు. అందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. స్థానిక పార్టీ కార్యాల యంలో గురువారం రాత్రి పార్టీ శ్రేణులతో భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడకలా సాగేందుకు ముందస్తు ప్రణాళికను వివరిం చారు. తోటివారిని చైతన్యపరిచేందుకు ప్రజలతో మమేకం కావా లన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, నాశిక వీరభద్రయ్య, గుద్దంటి చంద్రమౌళి, గంజి పురుషోత్తం, కొమ్మనబోయిన రజని, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.