యువగళం ముగింపు సభకు తరలిరావాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:22 PM
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అశేషంగా తరలివచ్చి వి జయవం తం చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ ఏర్పాట్ల పరిశీలకునిగా డాక్టర్ ఉగ్ర రేపు (20వ తేదీ) విజయనగరం జిల్లా నెలిమెర్లలో ముగింపు స భ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలివస్తున్నట్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
నెల్లిమర్లలో ఏర్పాట్ల పరిశీలన
కనిగిరి, డిసెంబరు 18: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అశేషంగా తరలివచ్చి వి జయవం తం చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ ఏర్పాట్ల పరిశీలకునిగా డాక్టర్ ఉగ్ర రేపు (20వ తేదీ) విజయనగరం జిల్లా నెలిమెర్లలో ముగింపు స భ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలివస్తున్నట్లు తెలిపారు. అం దులో భాగంగా కనిగిరి నియోజకవర్గం నుంచి అశేషంగా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఉగ్ర కోరారు. హాజరయ్యే వారికి ఉచితంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదు రోజులుగా ఉగ్ర ముగింపు సభ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నా రు. ప్రత్యేక రైలులో వచ్చే వారికి భోజన వసతి, ఇతర సౌకర్యాలను ఉగ్ర ప ర్యవేక్షిస్తున్నారు. ముగింపు సభాప్రాంగణంలో శ్రేణులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చూడడంతో పాటు పాదయాత్ర ముగింపు రోడ్ మ్యాప్‌లో నూ ప్రణాళికలో డాక్టర్ ఉగ్ర చూపిన చొరవపట్ల అధిష్టానం, ఉత్తరాంధ్ర జి ల్లాల టీడీపీ ముఖ్యనేతలు, లోకేష్ అభినందించారు.
యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలి
దర్శి, డిసెంబరు 18 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ దర్శి నియోజకవర్గ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి ఒక ప్రకటనలో కోరారు. ఈ సభకు ప్రత్యేక రైలును ఒంగోలు నుంచి ఏర్పాటు చేశారని, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.