పొగాకు బ్యారన్ దగ్ధం
ABN , First Publish Date - 2023-03-14T23:34:45+05:30 IST
పొగాకు బ్యా రెన్ దగ్ధమై రూ.6లక్షలు రైతుకు నష్టం వాటిల్లిన సంఘ టన హనుమంతునిపాడు మండలంలోని ముప్పళ్లపాడు గ్రా మంలో జరిగింది.
రూ.6లక్షల నష్టం
పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
హనుమంతునిపాడు (కనిగిరి), మార్చి 14 : పొగాకు బ్యా రెన్ దగ్ధమై రూ.6లక్షలు రైతుకు నష్టం వాటిల్లిన సంఘ టన హనుమంతునిపాడు మండలంలోని ముప్పళ్లపాడు గ్రా మంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం వేకువ జామున ప్రమాదవశాత్తు పొగాకు రైతు కోటపాటి శేషయ్య కు చెందిన బ్యారన్‌కు నిప్పంటింది. వేకువజామున కావడం తో ఎవరూ గమనించకపోవడంతో బ్యారన్‌లోని పొగాకు మొ త్తం కాలిపోయింది. రెండు రోజుల తర్వాత వేలంకు పొగా కును తీసుకెళ్లే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే అప్పులు చేసి పొగాకు పండించామని, మంచి రేటు పలుకు తున్న ఈ సమయంలో పొగాకు బూడిదయిందని రైతు శేష య్య ఆవేదన వ్యక్తం చేశారు. శేషయ్యకు చెందిన బ్యారన్ దగ్ధమైన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ముప్పళ్లపాడు గ్రామానికి వెళ్లి బ్యారన్‌ను పరిశీలించి, బాధిత రైతుతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉగ్రతోపాటు టీడీపీ మండలాధ్యక్షుడు సానికొమ్ము తిరపతి రెడ్డి, మాజీ అధ్యక్షుడు గాయం తిరుపతిరెడ్డి, చీకటి వెంకట సుబ్బయ్య, మురహరి నరసయ్య, గాయం రామిరెడ్డి, గ్రామ స్థులు ఉన్నారు.