వెలిగొండ పూర్తితోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2023-10-19T01:43:30+05:30 IST
నిత్యం కారువు కాటకాలతో బీళ్లుగా ఉన్న ఈ ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టుతోనే సస్యశ్యామలమవుతుందని, అది టీడీపీతోనే సాధ్యమని టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు
పెద్ద దోర్నాల, అక్టోబరు 18: నిత్యం కారువు కాటకాలతో బీళ్లుగా ఉన్న ఈ ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టుతోనే సస్యశ్యామలమవుతుందని, అది టీడీపీతోనే సాధ్యమని టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని పెద్దబొమ్మలా పురం గ్రామంలో మూడవరోజు బుధవారం టీడీపీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గూడూరి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం పదవీ కాలం మొత్తం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నార న్నారు. ఇసుక కొరత సృష్టించి భవన కార్మికులకు పొట్ట కొట్టారని, చంద్రన్న ప్రమాదబీమా, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తదితర పండుగ కానుకలు రద్దు చేశారన్నారు. నిరుద్యోగ భృతి నిలిపివేశారన్నారు. విద్యార్థులకు విదేశీ విద్య, ఫీజు రియంబర్స్‌మెంట్ కోతలు పెట్టారని, రైతులకు డ్రిప్ సౌకర్యం, పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేద న్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్ట మొదటిగా వెలుగొండప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రెండోదిగా మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు. మహిళలకు ప్రాధాన్యతఇస్తూ, ఏడాదికి మూడు సిలెండర్లు, ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15,000లువంటి ప్రజాకర్షక మేనిఫెస్టోను టీడీపీ ప్రకటించిందన్నారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కార్యక్రమంలో నాయకులు షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, కే.శ్రీనివాసులు, షేక్.ఇస్మాయిల్, చల్లా వెంకటేశ్వర్లు, బట్టు సుధాకర్ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం, శివారెడ్డి, ప్రదీప్, మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.
బాబుతోనే ప్రజలందరికీ మేలు
మార్కాపురం : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోనే ప్రజలందరికీ మేలు జరుగు తుందని టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని కోలభీమునిపాడులో బుధవారం ‘బాబుతోనే మేము’ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు జవ్వాజి వెంకటరెడ్డి మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కార్యక్రమాలలో మాజీ సర్పంచ్ మారంరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు జంకె రమణారెడ్డి, ఏరువ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు విడుదల కావాలని పూజలు
ఎర్రగొండపాలెం : చంద్రబాబుకు కోర్టులో న్యాయం జరగాలని కేసులు తొలగిపోవాలని స్థానిక వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం టీడీపీ నాయకులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీసెల్ టీడీపీ అధికారప్రతినిధి చెవుల అంజయ్య, మండల కార్యదర్శి బి.చెన్నవీరయ్య, ప్ట్టట్టణఅధ్యక్షులు షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శి డి వెంకట్రావు, మాగులూరి కోటేశ్వరరావు, షేక్ ఇస్మాయిల్, డి.గూడుసాహెబ్ పాల్గొని పూజలు చేశారు.