ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ రగడ
ABN , First Publish Date - 2023-08-22T11:12:49+05:30 IST
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఆలయ సూపరిండెంటెంట్ రమణ రాజు తనను అవమానించారని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను తన సిఫార్సు మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలు దర్శనానికి పంపించారు. టికెట్లు తీయమని వారితో దురుసుగా ప్రవర్తించారని సూపరిండెంటెంట్‌పై ఆరోపణలు చేశారు.
ఏలూరు : ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఆలయ సూపరిండెంటెంట్ రమణ రాజు తనను అవమానించారని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను తన సిఫార్సు మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలు దర్శనానికి పంపించారు. టికెట్లు తీయమని వారితో దురుసుగా ప్రవర్తించారని సూపరిండెంటెంట్‌పై ఆరోపణలు చేశారు. తన సిఫారుసుకు విలువ లేనప్పుడు తనెందుకు అంటూ సిద్ధమైన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రాజీనామాకు సిద్ధమయ్యారు. సూపరిండెంటెంట్ రమణ రాజును ప్రోటో కాల్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వివాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని ఆలయ ఈఓ త్రినాథరావు వెల్లడించారు.