Rains: ఏలూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు
ABN , First Publish Date - 2023-03-17T21:38:31+05:30 IST
బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా శుక్రవారం ఏలూరు జిల్లా (Eluru District)లో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో
ఏలూరు: బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా శుక్రవారం ఏలూరు జిల్లా (Eluru District)లో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కల్లాల్లో మిర్చి పంట తడిసి ముద్దయింది. ఒక్క సారిగా వాతావరణం చల్లబడడంతో రొయ్యలసాగులో ఇబ్బందులు ఎదురవుతాయని కైకలూరు మండలంలోని రైతులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతుండటంతో రైతులు తమ పంటను రక్షించుకోడానికి తంటాలు పడుతున్నారు. వర్షాల కారణంగా రైతులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వ్యవసాయ శాఖాధికారులు వివరిస్తున్నారు.
రైతుల్లో ఆందోళన
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులు కార ణంగా ఈనెల 19వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ హెచ్ఛరికలతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రస్తుతం వరి పంట పాలు పోసు కునే దశ నుంచి ఈనిక దశకు చేరుకుంది. మొక్కజొన్న పంట పాలుపోసుకునే దశతో పాటు కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న కోతకు వచ్చాయి. జిల్లాలో మిర్చి పంట సాగు చివరి దశలో ఉంది. దీంతో మిర్చిపంటను వర్షాల నుంచి రక్షించు కోవటానికి పంటపై పరదాలు కప్పుతు న్నారు. పొగాకు పంటను కాపాడు కునేందుకు పొగాకు పందిళ్ళపై బరకాలు కప్పుతున్నారు. ఈ విధంగా వివిధ పంటలు రక్షించు కోవటానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈనిక దశకు చేరుకోవడంతో భారీగా వర్షాలు కురిస్తే పంట దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు. ఈదురుగాలుల ప్రభావం ఎక్కు వగా ఉంటే మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లు తుందని రైతులు పేర్కొంటున్నారు. సాధార ణంగా ఏప్రిల్, మేనెలలో గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మార్చి నెలలో ఇటు వంటి పరిస్థితులు ఎదురుకాలేదని పలువురు రైతులు చెబుతున్నారు. ఈదురుగాలుల ప్రభా వం ఎక్కువగా ఉంటే అరటి, మామిడి తోటలు దెబ్బతింటాయని రైతులు చెబుతున్నారు.