Rammohan Naidu: ఎన్నికల భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు
ABN , First Publish Date - 2023-09-30T14:01:13+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఏపీ సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారన్నారు.
శ్రీకాకుళం : టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఏపీ సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారన్నారు. 20 రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. నాలుగేళ్లు ఎందుకు అవినీతి గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. దీన్ని చూసి జగన్ కు భయం పట్టుకుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
‘‘నాయకుడిని అరెస్ట్ చేస్తే టీడీపీ శ్రేణులు మనోధైర్యం కోల్పోతారు. వైసీపీ ఆలోచనలకు భిన్నంగా ప్రజలు చంద్రబాబు కోసం రోడ్లపైకి వస్తున్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటాం. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ప్రజా క్షేత్రంలో వైసీపీ కుట్ర రాజకీయాలను ఎండగడతాం. దుర్మార్గ పాలనను అంతమొందించటానికి జనసేనతో కలిసి పని చేస్తాం. 10 సంవత్సారాలు బెయిల్‌పై ఉన్న నాయకుడు జగన్ తప్పా ఎవరూ లేరు. తన బెయిల్ అనుభవాలతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. సీఐడీ వైసీపీ తొత్తుగా వ్యవహరిస్తోంది. పరిధి దాటి సీఐడీ వ్యవహరిస్తోంది. మా నాయుకుడిపై వచ్చిన ఆరోపణలకు ఢిల్లీ వేదికగా జవాబు చెప్పాం. జగన్ ఈడీ, సీబీఐ కేసులపై ఢిల్లీలో మాట్లాడగలరా?’’ అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.