Share News

Road Accident: శ్రీకాకుళంలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2023-11-21T15:33:31+05:30 IST

జిల్లాలోని మందస మండలం గౌడుగురంటి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Road Accident: శ్రీకాకుళంలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని మందస మండలం గౌడుగురంటి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రా గుండా ఓరిస్సా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఒరిస్సాకు చెందిన సవర డేహరా, సవర జగన్నాథ్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 లో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-11-21T15:35:57+05:30 IST