Rains: ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు
ABN , First Publish Date - 2023-01-02T22:09:48+05:30 IST
ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా ఉత్తరకోస్తా వరకు చలి గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి.
విశాఖపట్నం: ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా ఉత్తరకోస్తా వరకు చలి గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. చలి, తేమగాలులు కలవడంతో వాతావరణ అనిశ్చితి వల్ల ఉత్తర కోస్తాలో పలుచోట్ల సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి. ప్రధానంగా ఏజెన్సీలో పొగమంచు ఆవరించడంతో చలి వాతావరణం నెలకొంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ (Rayalaseema)లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో సోమవారం (Monday) పలుచోట్ల చలి వాతావరణం నెలకొంది. ఆరోగ్యవరంలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో చలి స్వల్పంగా పెరిగే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.