Sitaram Yechury: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనేది బీజేపీ విధానమంటూ సీతారాం ఏచూరి విమర్శలు
ABN , First Publish Date - 2023-10-05T18:46:21+05:30 IST
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై (BJP GOVT) సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై (BJP GOVT) సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) విమర్శలు గుప్పించారు.
"వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను (Vizag steel plant) అమ్మాలనేది బీజేపీ విధానం. అమ్మడాన్ని ఉపసంహరించే వరకు మేము పోరాడుతాం. గంగవరం పోర్టును ప్రైవేటీకరణ చేశారు. మోదీ సర్కారు వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణలను చేస్తోంది. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మేము కోరాం. మా ప్రభుత్వం వేస్తే.. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు వెంకయ్య నాయుడు అన్నారు. ఏమైందో అందరికీ తెలుసు. ప్రైవేట్ వ్యక్తులకు రుణాలు మాఫీ చేశారు. స్టీల్ ప్లాంట్ కి ఎందుకు అలా రుణాలను మాఫీ చేయలేదు?. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించవచ్చు..కానీ బీజేపీ అలా చేయడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలకు యజమానులు ప్రజలు.. పాలకులు, ఉద్యోగస్తులు. యజమానులు ఇబ్బందులు కలిగితే...ఉద్యోగాలు పోతాయాని నేటి పాలకులు గుర్తు పెట్టుకోవాలి. మన దేశాన్ని మోదీ తాకట్టు పెడుతున్నారు. దేశంలో ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చెడ్డవారి చేతుల్లో అమృతం ఉంది. దానిని మంచి వారు తీసుకోవాలి. చెడ్డ వారిని గద్దె దించి..దేశాన్ని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ అమర వీరులకు జోహార్లు అర్పిస్తున్నాం. ఇండియా కూటమి...28 పార్టీల తరుపున నుంచి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని హామీ ఇస్తున్నా. విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు...దేశం హక్కు...ఇది దేశ సంపద...అందరూ కాపాడాలి. రైతు చట్టాలను ఉప సంహరించినట్లే ..స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి." అని సీతారాం ఏచూరి అన్నారు.