Somu Veerraju: కేసీఆర్‌కు సిగ్గుందా?: సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-03T21:45:46+05:30 IST

ప్రాంతీయవాదంతో ఉన్మాదిలా వ్యవహరించిన కేసీఆర్ (KCR).. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సమస్యలపై మాట్లాడడానికి సిగ్గుందా అని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ప్రశ్నించారు.

Somu Veerraju: కేసీఆర్‌కు సిగ్గుందా?: సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: ప్రాంతీయవాదంతో ఉన్మాదిలా వ్యవహరించిన కేసీఆర్‌కు (KCR).. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సమస్యలపై మాట్లాడడానికి సిగ్గుందా అని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడ్డుపడి.. ఇప్పుడు ఆంధ్రా అంటూ రాజకీయ కూనిరాగాలు తీస్తున్నారని విమర్శించారు. భద్రాచలం రాములోరిని ఆంధ్రప్రదేశ్‌కి అప్పచెప్పి అప్పుడు ఆంధ్రలో రాజకీయాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కి వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ (BRS) అంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు.

ఇక ఏపీలో ఇదే రోడ్లుపై పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP).. రోడ్లపై సభలు, సమావేశాలు నియంత్రణ చేస్తూ తీసుకుని వచ్చిన జీవోను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయలేదని ప్రశ్నించారు. ఈ కారణంగా ప్రభుత్వ కోణంపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు.

Updated Date - 2023-01-03T21:53:46+05:30 IST