సెప్టిక్ ట్యాంక్‌లో పడిన ఎద్దు
ABN , First Publish Date - 2023-03-25T23:53:26+05:30 IST
సోంపేట మండలం శాసనంలో వి.షణ్ముఖరావుకు చెందిన ఓ ఎద్దు శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సెప్టిక్ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయింది.
మూడున్నర గంటలపాటు నరకయాతన
సోంపేట రూరల్, మార్చి 25: సోంపేట మండలం శాసనంలో వి.షణ్ముఖరావుకు చెందిన ఓ ఎద్దు శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సెప్టిక్ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయింది. షణ్ముఖరావు ఇంటి పెరడులో సెప్టిక్ ట్యాంకు నిర్మిస్తున్నాడు. ఇందుకోసం సిమెంట్ నందలు అమర్చారు. కాగా.. ఎద్దు ప్రమాదవశాత్తూ ఆ ట్యాంకులో పడిపోయింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఈ విషయాన్ని షణ్ముఖరావు గుర్తించాడు. టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు జీకే నాయుడు.. ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. తన ప్రొక్లెయినర్‌తో సెప్టిక్ ట్యాంకు సమాంతరంగా మట్టి తవ్వి బయటకు తీయించారు. యువకుల సహాయంతో రాత్రి 9 గంటల సమయంలో ఆ ఎద్దున బయటకు లాగారు. మూడున్నర గంటల పాటు ఆ ఎద్దు నరకయాతన పడినా.. చివరకు ప్రాణాలతో బయటపడడంతో షణ్ముఖరావు, స్థానికులు జీకే నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.