ఘనంగా ఉపనిషన్మందిరం వార్షికోత్సవం
ABN , First Publish Date - 2023-01-01T23:46:37+05:30 IST
నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఉపనిషన్మందిరం 71వ వార్షికో త్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఉపనిషన్మందిరం 71వ వార్షికో త్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకర విరచిత ప్రకరణ గ్రంథం గురించి రిటైర్డ్ అధ్యాపకుడు నిష్ఠ ల నర్సింహమూర్తి ప్రవచనం చేశారు. డా.సనపల నారాయణమూర్తి, విశ్వేశ్వరరావు, పంతంజలి శాస్త్రి, బాబూరావు, కామేశ్వరరావు వక్త నర్సింహమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, వెంకటరావు, తవుడు, చంద్రరావు, అనురాధ, సరస్వతి పాల్గొన్నారు.