చెట్టు పైనుంచి జారిపడి కల్లుగీత కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2023-03-08T23:33:03+05:30 IST
ఈతకల్లు తీసేందుకు చెట్టుపైకి ఎక్కిన ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతి చెందిన ఘటన దీర్గాశి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
పోలాకి: ఈతకల్లు తీసేందుకు చెట్టుపైకి ఎక్కిన ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతి చెందిన ఘటన దీర్గాశి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గేదెల ఎర్రయ్య (47) కల్లు తీ సేందుకు గ్రామం సమీపంలోని ఈత చెట్టు వద్దకు వెళ్లాడు. చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా జారిపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు 108 వాహనంలో నరస న్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందా డు. ఎర్రయ్యకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో లబోదిబోమంటున్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.