అదానీ కుంభకోణంతో దేశానికి తలవంపులు

ABN , First Publish Date - 2023-02-24T23:35:41+05:30 IST

అదానీ కుంభకోణం అంతర్జాతీయంగా భారతదేశాని కి తలవంపులు తెచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.తులసీదాసు విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ అని, కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలకు తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని చెప్పారు.

అదానీ కుంభకోణంతో దేశానికి తలవంపులు
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు:

అరసవల్లి, ఫిబ్రవరి 24: అదానీ కుంభకోణం అంతర్జాతీయంగా భారతదేశాని కి తలవంపులు తెచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.తులసీదాసు విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ అని, కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలకు తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని చెప్పారు. దేశాన్ని అప్రతి ష్టపాలు చేసిన అదానీ అవినీతిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్‌ వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం సామాన్యులపై భారాలు వేసి, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిందని, పేదలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించిందని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్‌లో ఉపాధిహామీ పథ కానికి రూ.30 వేలకోట్లు, ఆహార సబ్సిడీలో ఏకంగా రూ.90వేల కోట్లు కోత విధించిం దని, ఎరువుల సబ్సిడీపై 50వేల కోట్ల రూపాయల కోత విధించారన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయరంగ కేటాయింపులు తగ్గాయని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చే యడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు, వర్గాల వారు ముందుకు రావాలని పిలుపుని చ్చారు. జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తిలు మాట్లాడు తూ ఆహార పదార్థాలు, మందులతో సహా నిత్యావసరాలపై జీఎస్టీని ఉపసంహ రించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.మో హనరావు, పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, షన్ముఖరావు, ఎస్‌.ప్రసాద్‌, అమ్మన్నాయుడు, పి.ప్రసాద్‌, ఎన్‌వీ రమణ, అల్లు మహాలక్ష్మి, ఎ.సోమశేఖర్‌, అల్లు సత్యనారాయణ, హెచ్‌.ఈశ్వరరావు, కె.సూరయ్య, ఎల్‌.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-24T23:35:43+05:30 IST