యోగా కోర్సుకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-02-15T23:52:20+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో యోగా, ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో నిర్వహిస్తున్న ఏడాది వ్యవధి గల యోగా పీజీ డిప్లమో కోర్సులో చేరేం దుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ ఫెసర్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌ గురువారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు.

యోగా కోర్సుకు దరఖాస్తులు

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో యోగా, ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో నిర్వహిస్తున్న ఏడాది వ్యవధి గల యోగా పీజీ డిప్లమో కోర్సులో చేరేం దుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ ఫెసర్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌ గురువారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని, మార్చి 6వ తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.10,000 ట్యూషన్‌ ఫీజు చెల్లించాల న్నారు. వర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసిన దర ఖాస్తును పూర్తిచేసి రిజిస్ట్రార్‌ పేరిట రూ.200 డీడీ తీసి నిర్ధేశించిన తేదీలోగా యోగా విభాగానికి అందజేయాల న్నారు. మరిన్ని వివరాలకు 9490677790, 72859 13769, 96036 99414 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2023-02-15T23:52:22+05:30 IST